14 July 2010

అన్నయ్యకలలె పండెను చెల్లాయి మనసేనిండెను

పల్లవి

అన్నయ్యకలలె పండెను చెల్లాయి మనసేనిండెను
బంగారు కాంతులేవో నేడే తొంగి చూసెను ||అన్నయ్య||

చరణం 1

తోడునీడ నీవై లాలించే అన్నయ్యా (2)
తల్లితండ్రి నీవై పాలించే అన్నయ్యా
నీకన్న వేరే పెన్నిధి లేనే లేదు
నా పూర్వ పుణ్యాల రూపమే నీవు ||అన్నయ్య||

చరణం 2

రతనాల సుగుణాల రాణివినీవే
అన్నయ్య నయనాల ఆశవునీవే
నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు
నీ నవ్వు సిరులొల్కు ముత్యాలజల్ల ||అన్నయ్య||

చరణం 3

మీ అన్నయ్య మనసె సిరిమల్లె పువ్వును (2)
చెల్లి కంట తడివుంటే తల్లడిల్లెను
నీ పూజలే నన్ను నడిపించు తల్లి
శతకోటి విజయాలు సాధించు చెల్లి ||అన్నయ్య||

No comments: