14 July 2010

మదిలో వీణలుమ్రోగే ఆశలెన్నొ చెలరేగే

పల్లవి
మదిలో వీణలుమ్రోగే ఆశలెన్నొ చెలరేగే (2)
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే ||మదిలో||

చరణం 1

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గతొడిగింది (2)
పాలవెన్నెల స్నానాలుచేసి పూలుపూసింది ||మదిలో||

చరణం 2

కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందు కోరేను(2)
అందాలతారయై మెరిసి చెలికానిచెంత చేరేను ||మదిలో||

చరణం 3

రాధలోని అనురాగమంతా మాధవునిదే లే (2)
వేణులోలుని రాగాలకోసం వేచి వున్నదిలే ||మదిలో||

No comments: