02 July 2010

నవ్వూ నవ్వూ..

నవ్వూ నవ్వూ..
నెలవంకల్లే నవ్వూ
నవ్వూ నవ్వూ..
పసి పాపల్లే నవ్వు
మాట నవ్వితే పాట మల్లె నవ్వితే తోట
మబ్బు నవ్వితే వాన నీ మనసు నవ్వితే ప్రేమ

కాయ నవ్వితే పండంట
కాకమ్మ నవ్వితే కబురంట
చిరనవ్వు నువ్వు నవ్వితే చలి మంట
పాలు నవ్వితే పెరుగంట
దీపాలు నవ్వితే వెలుగంట
ముసినవ్వు నువ్వు నవ్వితే ముసురంట
నిన్న నవ్వితే నేడంట
నేడు నవ్వితే రేపంట
నువ్వు నేను నిండుగా నవ్వితే నూరేళ్ళంట

చూపు నవ్వితే ముందుంటా
నీ చెంప నవ్వితే ముద్దంట
నీ పైట చెంగు నవ్వితే పడి ఉంటా
కోక నవ్వితే పదమంటా
చెవి దుద్దు నవ్వితే పదవెంట
నా చీర కొంగు నవ్వితే సిగ్గంట
కనులు నవ్వితే పగలంట
కురులు నవ్వితే రేయంట
పగలు రేయి పరువం నవ్వితే సరసాలంట

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips