02 July 2010

తొడకొట్టి చెబుతున్నా తొలిమాట.........

||పల్లవి||
తొడకొట్టి చెబుతున్నా తొలిమాట......... జబ్బ చరిచి చెబుతున్నా భలే మాట....
రొమ్ము విరిచి చెబుతున్నా......కాలు దువ్వి చెబుతున్నా..... బల్ల గుద్ది చెబుతున్నా బంపరు మాట.......
ప్రేమన్నది ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్కు......
ప్రేమన్నది ప్రతి ఒక్కరు తీర్చాల్సిన మొక్కు.....
ప్రేమన్నది రాజ్యాంగం మనకిచ్హిన హక్కు......
ఇదే తారక మంత్రం.......నేటి యువతకు సూత్రం.......
ఇదే తారక మంత్రం.......ఇది అక్షర సత్యం......

||ఛరణం 1||
ఆడ రెండక్షరాలు, మగ రెండే అక్షరాలు....... ఆడ మగ మధ్య పుట్టు ప్రేమే రెండక్షరాలు...........
తప్పు రెండక్షరాలు, ఒప్పు రెండు అక్షరాలు..... తప్పొప్పులు చేయించు ప్రేమే రెండక్షరాలు........
బాధ రెండక్షరాలు, హాయి రెండక్షరాలు, ఈ రెంటిని కలిగించు ప్రేమే రెండక్షరాలు...........
ప్రేమన్నది ఫలిఇస్తే పెళ్ళి రెండక్షరాలు......
ప్రేమన్నది వికటిస్తే పిచ్హి కూడా రెండక్షరాలే........
ఇదే తారక మంత్రం.......నేటి యువతకు సూత్రం.......
ఇదే తారక మంత్రం.......ఇది అక్షర సత్యం......

||ఛరణం 2||
ప్రేమన్నది ఒక గ్రామం, ప్రేమికులకు స్వగ్రామం....... ఎదిరించిన వాళ్ళతో చెస్తుందోయ్ సంగ్రామం........
ప్రేమన్నది పదో గ్రహం, అందించును అనుగ్రహం....... అనుగ్రహమే పొందుటకు కావాలోయ్ నిగ్రహం.........
ప్రేమన్నది ఒక దారం, అన్నిటికది ఆధారం, ప్రేమించిన హ్రుదయాల్లో పూస్తుందోయ్ మందారం..........
ప్రేముంటె సౌభాగ్యం, లేకుంటే దౌర్భాగ్యం........
లవ్వాడుట ఆరోగ్యం......ఆడకుంటే అదో అనారోగ్యం..........
ఇదే తారక మంత్రం.......నేటి యువతకు సూత్రం.......
ఇదే తారక మంత్రం.......ఇది అక్షర సత్యం......

No comments: