14 July 2010

మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి

పల్లవి

మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . ||2||
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . ||2||
లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా ||మధుర||

చరణం 1

శృంగారం వాగైనదీ ఆ వాగే వరదైనదీ
ముడిపెట్టి యేరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకదిమితోం
విశ్వనాధుని ఏకవీర తమిళ మహిళల వనుకువతో
యెదలో యమునై మమ్మేటి ప్రేమకి మీనాక్షి
వరముల యమునై మమ్మేటి ప్రేమకి దిగిరావా

చరణం 2

అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో
కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో
తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
మనసూ మనసూ ఒకటైన జంటకి ఇది సాక్షి

No comments: