01 July 2010

ఎందుకో.. తొలి తొందరెందుకో..

హో..ఓ..ఓ.ఒ..హో..ఓ..ఓ.ఒ..హో..ఓ..ఓ.ఒ..ఓ..ఓఓ..||2||

ఎందుకో.. తొలి తొందరెందుకో.. నాలో.. యెద చిందులెందుకో..
నాకే ఇంతందమెందుకో..మెరుపెందుకో...
ఎన్నడూ తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో..
నేనే నాలాగ అస్సలు లేనెందుకో...
సొగసులకు ఈ రోజు బరువెందుకో...
నడకలకు ఈ రోజు పరుగెందుకో...
ఊపిరికి ఈరోజు ఉడుకెందుకో...
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో...
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖ లోన వెలిగేందుకా...
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనెలోన మునిగేందుకా...ఆ..ఆ..

||ఎందుకో||

ఆ ఊరు ఈ ఊరు వేరైనా ఆ ఆ ఆకాశం అంతా ఒకటేగా
ఆ నువ్వు ఈ నేను ఏడున్నా ఆలోచనలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయభారం ఊసులే చేరవా వేగిరం
ప్రేమలో చిన్నదీ ఈ ప్రపంచం అని తెలిసి కూడా తెగ అలజడాయె..
ఆ తలపులోనె తలమునకలాయె మరి ఎందుకోఓ..ఓఓ
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన బాట లోన తన తోట లోన తన తోడులోన తన నీడ లోన నడిచేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన తనువులోన అణువణువులోన మధువనములొన ప్రతి కణములోన కలిసేందుకా

ఎందుకో.. తొలి తొందరెందుకో.. నాలో.. యెద చిందులెందుకో..
నాకే ఇంతందమెందుకో..మెరుపెందుకో...
ఎన్నడూ తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో..
నేనే నాలాగ అస్సలు లేనెందుకో...
సొగసులకు ఈ రోజు బరువెందుకో...
నడకలకు ఈ రోజు పరుగెందుకో...
ఊపిరికి ఈరోజు ఉడుకెందుకో...
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో...
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖ లోన వెలిగేందుకా...
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా...
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనెలోన మునిగేందుకా...ఆ..ఆ..
హో..ఓ..ఓ.ఒ..హో..ఓ..ఓ.ఒ..హో..ఓ..ఓ.ఒ..ఓ..ఓఓ..||2||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips