17 July 2010

ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా

ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా
ఓ నా రాజా రావా రావా

నీ రూపె ఆశ రేపేను నీ మాటె వీణ మీటేను
నీ రూపె ఆశ రేపేను నీ మాటె వీణ మీటేను
గతాలె నన్ను పిలిచాయి ఆ హాయె నేడు లేదోయి
కలగ కరిగిందంట జగమె యెంతో వింత
రేయి పగలు నిన్నే వెదికేనూ

వ్రుధాగ కాలమేగెను నిరాశె పొంగి వచ్చేను
వ్రుధాగ కాలమేగెను నిరాశె పొంగి వచ్చేను
తరంగం లాగ రావోయి ప్రియా నన్నాడుకోవోయి
యేదో తీరని బాధ కన్నీరొలికే గాధ
రేయి పగలు నిన్నే వెదికేను

నీ కోసం నేనే వచ్చాను నీ ఇంటికి దీపం అయినాను
నీకోసం నేనే వచ్చను నీ ఇంటికి దీపం అయినను
నాతోని ఆడు కోవెల ఈ కోపం నేడు నీకేలా
నీ అడుగులలో నేను నా కన్నులలో నీవు
నాలో నీవు నీలో నేనేలే

No comments: