14 July 2010

రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసీగా రమ్మంటు కబురెట్టిందా

పల్లవి

రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసీగా రమ్మంటు కబురెట్టిందా...
కృష్ణ ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనస్సే లాగేసిందా
ప్రియపురుషా వరసా ఇంకా కలిపెయమంటా
మృదువదనా పతినై పరిపాలించనా
చల్లో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ ||రాధే||

చరణం 1

నీ కోసమే పుట్టాననీ వూరించకోయ్ వాస్సాయనా
నా కోసమే వచ్చావనీ వాటేయనా వయ్యారమా
తొలిప్రేమ జల్లులే కురవాలంటా
పరువాల పంటలే పండాలంటా
చలిబుగ్గ సిగ్గుతొ మెరవాలంటా
కైగిళ్లజాతరే జరగాలంట
అరే ఆకలివేస్తే సోకులిస్తా చూపులుతోటి షాకులిస్తా
ఒడిలో సరాసరి పడకేస్తే మామా ||కృష్ణ ముకుందా||

చరణం 2

[అతడు] అంగంగము వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే
వదిలేసేనే మోమాటమే సాధించావోయ్ సల్లాపమే
రతిరాణి దర్శనం ఇవ్వాలంటా
ఏకాంత సేవలే చేయాలంట
కసిగువ్వరెక్కలే విప్పిందంటా
నీ కోసమే పక్కలే పరిచిందంటా
అరే మెత్తకువస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా
సరినే మగసిరిలో దోచేస్తా భామా ||రాధే||

No comments: