14 July 2010

ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా

పల్లవి

ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా
జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా ||ఘల్లుఘల్లు||
హరివిల్లు విప్పి కరిమబ్బువాన బాణాలే వేయమని
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని
జడివాన దారతో ఈవేళ జనజీవితాలు చిగురించేల
రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల ||జడివాన||ఘల్లుఘల్లు||

చరణం 1

రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని
ఈ రక్తాక్షర రేఖని ఇపుడే పంపని
అన్నెం పున్నెం ఎరుగని మాసీమకు రా రమ్మని
ఆహ్వానం అందించనీ మెరిసే వానగ
తొలగింది ముప్పు అని నీలిమబ్బు మనసారా నవ్వని
చిరుజల్లుముంపు మన ముంగిలింత ముత్యాలె చల్లని
ఆ సాసు గంధయై నేలంతా సంక్రాంతి గీతమై పాడేల
శాంతిమంత్రమై గాలంతా దిసలన్ని అల్లనీ ఈవేళ ||జడివాన||

చరణం 2

భువిపై ఇంద్రుడు పిలిచెర కరుణా వరదై పలకర
ఆకసాన్ని ఇలదించర మురిసే వానగ
మారని యాతన తీర్చగ మా తలరాతలు మార్చగ
ఈ జలయజ్ఞము సాక్షిగ తలనే వాల్చర
మహరాజు తానె ప్రమిదల్లె మారి నిలువెల్లా వెలిగెర
బోగాన్ని విడిచి త్యాగాన్ని మలచి తాపసిగా నిలిచె
జన క్షేమమె తన సంకల్పముగ తన ఊపిరె హొమ జ్వాలలుగ
స్వర్గాన్నె శాసించెనుర అమృతమును ఆహ్వానించెనుర ||జడివాన|| ఘల్లు ఘల్లు||

No comments: