01 July 2010

జాబిలి పైనా మేఘం...... ఉండదు ఎంతో కాలం.......

జాబిలి పైనా మేఘం...... ఉండదు ఎంతో కాలం.......
ఎందుకు నేస్తం నీలో నీకీ మౌనం.......
ఏమైంది నీలో ఆ వేగం
కూర్చుని ఉంటే తీరం....... చేరదు దాటి దూరం......
చీకట్లోన ఉంటే నీదే నేరం
అదుగో నీ గమ్యం నీకోసం
అనుకున్నదేదో నెరవేరెవరకు ఇక ఆగరాదు నడక
సంకల్పమంటె మన గుండెలోన ఒక నిప్పురవ్వ గనుక
ఓహో....... ఓ...... ఓహో....... ఓ...... ||జాబిలి||

కొండ గాలిని రెండుచేతులే ఆపివేయునా
గడ్డి పోచలు ఎన్నివేసినా వాగు ఆగునా
పంజరాలలో చిలక నుంచినా మాట మారునా
కోయిలమ్మను ఖైదుచేసినా పాట ఆపునా
మనసులరేగే బాధని చిరునవ్వుతొ గెలవాలి....
విధిరాసే రాతను నువు మార్చివేయాలి
ఉలులకే భయపడి బెదిరితే ఎలా...
శిల్పమై కదిలితే కధే మారదా...
పొగరెక్కి వచ్చె పొగమంచు సూర్య కిరణాన్ని మూయగలదా
పగబట్టి పిడుగులెన్నొచ్చిపడిన కెరటాలనాపగలవా
ఓహో....... ఓ...... ఓహో....... ఓ......

నిద్రపోయిన కళ్ళచాటున చీకటున్నది
లేచిరమ్మనే వెలుగుచుక్కలో వేకువున్నది
గమ్యమెప్పుడు మనిషి కోసమే వేచిఉంటది
అందరానిది అందుకొమ్మనే ఆశ దానిది
నడకలు నేర్చే వేళలో అడుగడుగున బాధైనా.....
ఇక నాకు రాదని చతికిలపడిపోయామా
తెలుసుకో నడకలో అనుభవాలని......
తపనతో అపజయం తలేవంచదా......
కనురెప్ప మూసే ప్రతిసారి ఎదలో మోగాలి గెలుపు పిలుపే
కనురెప్ప తెరిచె ప్రతిసారి మనిచి చూడాలి గెలుపు మలుపే
ఓహో....... ఓ...... ఓహో....... ఓ......

No comments: