01 July 2010

నువ్వే నాప్రాణం నీతోనే నా పయనం

నువ్వే నాప్రాణం నీతోనే నా పయనం
అనుకుంటూ ఉంటే హాయిగా ఉంది
నీకే నాహృదయం నీప్రేమే నా విజయం
అనుకుంటూ ఉంటే ఎంతబాగుంది
ఇక తొలిప్రేమ మలిప్రేమ తుదిప్రేమ నువ్వే ||నువ్వే నా||

చూపే చుట్టరికం మన మనసే మేనరికం
కలలే ఇల్లరికం చిగురాశలు అల్లరికం
కలిగాక ఈ మైకం
ఇంకా ఎందుకు లోకం ||నువ్వే నా||

ఏదో అనుబంధం ఏ జన్మదో ఋణబంధం
ఎదతో సంబంధం ఎడబాటొక నిర్బంధం
జరిగాక ఒప్పందం
జరుగును మమతల పందెం ||నువ్వే నా||

No comments: