21 July 2010

పిలిచిన మురళికి వలచిన మువ్వకి --Aanadha Bhairavi

పల్లవి:


పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం
అది ఆనందభైరవిరాగం
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం
మది ఆనందభైరవిరాగం

చరణం1:

కులికే మువ్వల అలికిడి వింటే కలలే నిద్దుర లేచే
కులికే మువ్వల అలికిడి వింటే కలలే నిద్దుర లేచే
మమతే మురళి ఆలాపనలో మధురానగరిగ తోచే
యమునా నదిలా పొంగినది స్వరమే వరమై సంగమమై

మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం
మది ఆనందభైరవిరాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం
అది ఆనందభైరవిరాగం

చరణం2:

ఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియ మోగే
ఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియ మోగే
పదమే పదమై మదిలో వుంటే ప్రణయాలాపన సాగే
హృదయం లయమై పొయినది లయలే ప్రియమై జీవితమై

మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం
మది ఆనందభైరవిరాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం
అది ఆనందభైరవిరాగం

No comments: