12 July 2010

ఇది రణరంగమా లేక అగ్నిగుండమా

ఇది రణరంగమా లేక అగ్నిగుండమా విధి నడిపే ప్రేమా అర్దమవదే (2)
అగ్ని కణము నీటి గుణము రెంటిని కలిపితే నువ్వేనా
ఇవతలివైపు దేవతవైతే అవతలివైపు దెయ్యమువా
సమయము తింటావ్ మెదడుని తింటావ్ నన్నే తింటావ్ తప్పుకాదా
పనిపాట లేని పిల్ల ఇంట్లో నీకు తిండిలేదా
చూపులు తగలగ మాటలు పెగలగ ఉరుములు మెరుపులు ఆరంభం
పాదం కేశం నాభి కమలం రగులు కొనగా ఆనందం
దగదగమని వెలిగెను జ్వాల సెగసెగయని ఎగిరెను బాల
తహతహమని తపనల గోల కసికసియని కౌగిలి ఏల

మిత్రులబృందం ఎదురే వస్తే పక్కకి తొలిగి నడిచితిని
పొద్దున నిన్ను చూస్తానంటు రాత్రినంతా గడిపితిని
ఇట్టా ఎట్టా రోజులు గడవక ఇంకా నన్నేఒఇచేస్తావు
మాయమంత్రం తెలిసినదానా త్వరగా నన్ను చంపెదవా
ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగా కడుతుందా
నన్నే కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది
చిటపటమని చిందేస్తావా వదులొదులని విదిలిస్తావా
దడదడమని దడిపిస్తావా ఒంటరిగా వదిలేస్తావా
ఇది రణరంగమా లేక అగ్నిగుండమా విధి నడిపే ప్రేమా అర్దమవదే

No comments: