12 July 2010

కన్నుల బాసలు తెలియవులే

కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
ఇది అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే

అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే
కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనపడు వెలుగు దారికే చెందదులే
మెరుపుల వెలుగును పట్టగ మినుగురు పురుగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట
అల కడలిదాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమటా
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే

లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే
ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి డీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
ఉప్పెనొచ్చిన కొండ మిగులును చెట్లు చామలు మాయవునులే
నవ్వు వచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసివచ్చులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే
కన్నుల బాసలు…..ఏ కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips