02 July 2010

ఈ పాట నీ కోసమే హోయి

ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీ కోసమే
ఈపూలు పూచేది ఈ గాలి వీచేది మనసైన మన కోసమే

పగలైనా రేయైయినా నీధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
నీ చూపు నా పాలి సుమ బాణమే
నిన్ను చూడ కదలాడు నా ప్రాణమే

నీ గుండె లొ నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
నీ కళ్ళ వెనకాల నేనుంటిని
కనరాని వలయాలు కనుగొంటిని
ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీ కోసమే
ఈపూలు పూచేది ఈ గాలి వీచేది మనసైన మన కోసమే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips