12 July 2010

ప్రియతమా

ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువునా తగిలిన హృదయమా
మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మా
వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా… ప్రేమే నీవే భామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువునా తగిలిన హృదయమా

చదివేద పాఠం ఒకసారి వల్లెవేయవా
గిలిగింత రాగం తొలిసారి నేర్పి చూడవా
అది ప్రేమ లాంచనం మధుమాసమీదినం
మరుమల్లె శోభనం స్వరదాన సాధనం
తారలన్ని ధారపోసే సోయగాలు నీవిలే
వాంఛలన్ని ఆరిపోయే వాయిదాలు వేయకే
భ్రమరికా కమలమా…. రారా మేఘశ్యామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువునా తగిలిన హృదయమా
వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా.. ప్రేమే నీవే భామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువునా తగిలిన హృదయమా

గంగా విహారం ప్రియ సామవేద గానమై
వోల్గా కుటీరం మన సామ్యవాద రూపమై
ఒకసారి ఇద్దరం అవుదాము ఒక్కరం
నదికోరు పుష్కరం మనసైన కాపురం
ఆకాశాలు దాటిపోయే ఆశయాలు నావిలే
పాలపుంత తోడుకున్న పాయసాలు తీపిలే
మగువనీ మధుపమా… ఏలా ఈ హంగమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మా
వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా.. ప్రేమే నీవే భామా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
తనువునా తగిలిన హృదయమా

No comments: