12 July 2010

లేదని చెప్ప నిమిషము చాలు

లేదని చెప్ప నిమిషము చాలు లేదనమట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే.
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే
అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవె (2)

హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపాను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖీ అద్దాల ఊయల బింబమూగె చెలీ…
నువ్వు తేల్చి చెప్పవే పిల్లా ఎద కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే
లేదని చెప్ప నిమిషం చాలు లేదనమట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే.
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా

తెల్లారి పోతున్నా విడిపొని రాత్రేది వాసనలు వీచే నీ కురులె సఖీ
లొకాన చీకటైన వెలుగున్నా చోటేది సూరీడు మెచ్చే నీ కనులె చెలీ…
విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగ రావే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా….
ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా….
ఏమి చేయమందువే

No comments: