14 July 2010

కురులలో కుసుమమై గళములో హారమై పరువానికి పసుపూ

పల్లవి

కురులలో కుసుమమై గళములో హారమై పరువానికి పసుపూ
కుంకుమై ఆడతనానికి అయిదో తనమై నునుపాలించగ
నడిచి వచ్చితివో నను దివించగ దరికి చేరితివో నీ జాతికి
నీ కరుణకీ ఆశీస్సుకి అభయానికి నాకై కదిలిన నీ పాదాలకి
ధన్యవాదాలు... ధన్యవాదాలు... నా జన్మ ధన్యవాదాలు నను పాలించగ నడిచి...

చరణం 1

మనసా స్మరామి, శిరసా నమామి, వచసా ధృనామి ఓ... ఓ...
నీ సన్నిధిలో పొంగిన వేళ గంగనై నీ సాయమునకు ముగిసిన వేళ
యముననై నీ అంతతంగములో ఎగసే తరంగమునై నిలిచే సరస్వతినై ఆ
నీతిపూవుతో పన్నీటిపూలతో ధన్యవాదాలు ధన్యవాదాలు
ననుపాలించగ నడిచి...

చరణం 2

నీకై చూసేవేళ నా మనసు కనులలో ఉంటుంది నిన్నే పిలిచే వేళ నా మనసు
పెదవిలో ఉంటుంది నీకై నడిచే వేళ నా మనసు అడుగులో ఉంటుంది. నిన్నే
చేరిన వేళ నా మనసు మనసులో ఉంటుంది మనసైన నీకు నీలోని నాకు
ధన్యవాదాలు... ధన్యవాదాలు.

చరణం 3

నిను పాలించగ నడిచి వచ్చితివి, నిను పూజించగ పతినై చేరితినే నీ చెలిమికి
సుగుణాలకి ఈనాటికి ఏనాటికి నాపై పెట్టిన నీ ప్రాణాలకు
శిరసానమామి
ధన్యవాదాలు
వచసా స్మరామి
ప్రతి జన్మ ధన్యవాదాలు
మనసా స్మరామి, శిరసానవామి, వచసా స్మరామి నా జన్మ ధన్యవాదాలు
ప్రతి జన్మ ధన్యవాదాలు

No comments: