18 July 2010

కరుణాలవాలా ఇది నీదు లీల అంతయును వింత పొగడగ నేనెంత

నీ మాయ కానంగ లేరు వేయి నేత్రాలు వున్నను ఎవరు

పర సతులను చెరబట్టే అంధుడు అతడాసురలోకము పాలించే ఇంద్రుడు

పదవి మీద ఆశ చేత ప్రభువాయెను పశువు
పదవి మీద ఆశ చేత ప్రభువాయెను పశువు
పాపము తన నేమి చేసె కడుపులోని శిశువు
కరుణాలవాలా ఇది నీదు లీల అంతయును వింత పొగడగ నేనెంత

కాంత చేతిలోపల ఏ మంత్రమున్నదో ఓ ఓ ఓ
కాంత చేతిలోపల ఏ మంత్రమున్నదో ఎంత భీకరుండైనా శాంత మొంది తీరునే ఏ ఏ
ఇంతి కంటి చూపుకి ఇనుమైనా కరుగునని అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా
కరుణాలవాలా ఇది నీదు లీల అంతయును వింత పొగడగ నేనెంత
కరుణాలవాలా

మహా శక్తిమంతులైనా నిజం తెలియలేరయ్యొ నిజం తెలియలేరే నీ మాయ నరయ లేరే
నరహరి రూపా నారాయణా జయ నారాయణా హరి నారాయణా
నీరు పల్లమెరుగు ఎపుడు నిజం తెలుసు నీకే

బ్రహ్మ యిచ్చిన వరములు తెచ్చెను కర్మ ఈ కర్మ
దుష్కర్మ నాపుట బ్రహ్మ విష్ణుల తరమా తరమా
తాను తీసిన గోతి లోపల పడునే తానే
తపోశక్తిని జయించలేరు దైవమైన పరదైవమైనను
కరుణాలవాలా ఇది నీదు లీల అంతయును వింత పొగడగ నేనెంత

ఏడేడు లోకాల ఏలికా నీపైన పాడగా చాలదోక నాలుక

నీవు తలచిన చాలు మెరుసె అణువు
నీ చేతిలో గలదు అందరి పరువు ఆ ఆ ఆ ఆ
మహిమన్న నీవేనులే ఏమైన దైవమన నీవేనులే
శీహరియే నటన సూత్రధారి తానే ప్రవేశించు కొత్త పాత్రధారి
శ్రీహరియే నటన సూత్రధారి తానే ప్రవేశించు కొత్త పాత్రధారి
ఇది నీవాడించుచున్న నాటకము
ఇక నుండదు వింతలకే కాటకము

No comments: