14 July 2010

అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ అతని వెన్నెలలే

పల్లవి

అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ అతని వెన్నెలలే
||అందెను||

చరణం 1

ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే||2||
చెలికాడే నాలో తలపులు రేపెనులే
||అందెను||

చరణం 2

నా చెక్కిలి మెల్లగ మీటగానే
నరనరముల వీణలు మోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే||2||
నెలరాజే నాతో సరసము లాడెనులే
||అందెను||

చరణం 3

ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీథిని నా మది విహరించెలే||2||
వలరాజే నాలో వలపులు చిలికెనులే
||అందెను||

No comments: