14 July 2010

రానని రాలేనని ఊరకె అంటావు

పల్లవి

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
||రానని||

చరణం 1

కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు||2||
వేషమైనా మోసమైనా అంతా నీ కోసం
ఊహూ...అలాగా...
||రానని||

చరణం 2

ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది||2||
గుండె మీద వాలి చూడు గోడు వింటావు
ష్...అబ్బబ్బబ్బా...
||రానని||

చరణం 3

దోర వయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో||2||
కరుణ చూపి కరుగకున్న టాటా చీరియో
టాటా చీరియో
||రానని||

No comments: