02 July 2010

చిటా పటా....... చిటా పటా.......

||పల్లవి||
చిటా పటా....... చిటా పటా....... చిటా పటా.......
చిటా పటా....... చిటా పటా....... చిటా పటా.......
చిటా పటా చిటా పటా చిందే వానా.........
ఇక చెటా పటా చెటా పటా వేసే వానా......
చెట్టే లేని పువ్వుల్లాగ రాలే వానా..... చెంత వాలే వానా.....
వానా వానా...... వెండి వానా..... బంగారంలా నిను దాచెయ్యనా
వానా వానా...... రౌడి వానా..... చేసే అల్లర్లు గుండె నిండ నింపుకోన.......
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా........ నీతో రానా......
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా........ ఏదేమైనా...... ||చిటా పటా||

||చరణం 1||
వానకొట్టి వణుకుపుట్టి చలిగా ఉన్నాకాని చల్లనైన ఐసు నేను తింటూ ఉంటా
ఏకధాటి వానలోన ఎగిరి తడిసి అలిసి తెచ్చుకున్న జలుబులోన తుమ్ముకూడ కమ్మనంట
నల్లమబ్బులే నా ఆశకేమో అద్దమంట
నల్లగొడుగులే నా ఆటకేమో అడ్డమంట
ఆటలాడి చేస్తుంటే కొంటె చేష్టలే మబ్బు అమ్మలాగ వేస్తుంది నీటిమొట్టికాయలే
చిలిపి దాడి చేస్తుంటే చిట్టి చినుకులే నేల నాకుమల్లె ఒళ్ళంతా పులకరించిపోయెలే
వానా వానా...... నచ్చే వానా....... నన్నే నీలోన చూస్తూ ఉన్నా......
వానా వానా...... నవ్వే వానా...... ఆకాశాన్నంటె నిచ్చెనల్లే చేసుకోన
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా........ నీతో రానా......
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా........ ఏదేమైనా...... ||చిటా పటా||

||చరణం 2||
వానవిల్లు రంగులంటే ఏడే ఉంటాయేమో వేల వేల రంగులన్ని నాకేచెల్లు
వానజల్లు కురిసెనంటె ఉరుమే ఉరిమేనేమో ఉరుము లేక చినుకునంట కుర్ర కళ్ళు ప్రేమజల్లు
చినుకు తాకితే జిగొచ్చునంట కోనసీమ
నేను తాకితే ఫలించునంట కొంటెసీమ
మేఘాన ఉన్నాయ్ నీటి పిడుగులే నా దేహాన ఉందోయ్ పట్టువిడని పిడికిలే
తారల్లో ఉన్నాయ్ మెరుపు తీగలే నా దేహాన పూచాయ్ వెలుగుపూల తీగలే
వానా వానా...... బుజ్జి వానా....... నన్నే నీతోటి పోలుస్తున్నా....
వానా వానా...... బుల్లి వానా...... నాలో భావాలు మనసు విప్పి పంచుకోన
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా........ నీతో రానా......
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా........ ఏదేమైనా...... ||చిటా పటా||

No comments: