17 July 2010

పెద్ద మర్రికేమో చిన్న కాయలిచ్చె సన్న తీగల్లోనా గుమ్మళ్ళు

పల్లవి

పెద్ద మర్రికేమో చిన్న కాయలిచ్చె సన్న తీగల్లోనా గుమ్మళ్ళు
కాయించి చిత్రం చేస్తివే గురువా ఎందుకో చెప్పగలవా బురదగుంట
లోనా తామర నుంచి ముద్దు గులాభికి ముళ్ళనడ్డుపెట్టే చిత్రం చేస్తివే
గురువా ఎందుకో చెప్పగలవా లెక్కలేని చిత్తరాలు ఎన్నో కళ్ళ
ముందు లేవా గుట్టువిప్పి చెప్పుకుంటూ పోతే అంతు చూడగలవా
అసలెందుకు నీకిగొడవ కాస్త ఊరికే ఉండలేవా ||2||

చరణం 1

అందమైన కస్తూరి జింకను అడవిలోకి తోలేసినావు మందలుగా
పందులనేమో ఊరిమీదకి వదిలేశావుఅంతో ఇంతో పొద్దు
పోనిదే రాతలేమి రాయవు నువ్వు లెక్క తప్పుకోనిదే నువ్వు నిద్దర
పోలేవు ముచ్చటైన మనిషివి తెచ్చి పల్లెల్లోనా పెంచింది నేను
కోతి మూక అల్లరినంతా కోనల్లోనే దాచి ఉంచాను ఆచి తూచి
ఆలోచించే అన్నీ నేను చేసుంటాను చెప్పదంటూ సందేహాలకు
ఎట్టా దొరుకుతాను ఎందుకు నీకి గొడవ కాస్త ఊరికే ఉండలేవా
అసలెందుకు నీకి గొడవ కాస్త ఊరికే ఉండలేవా

చరణం 2

ఓ బంగారు నేలపైనా బుక్కరు భాగం ఉప్పునీరు నింపేసినారు
తాగు నీరు లోతున దాచి బావులెన్నో తవ్వించావు కొంచెమైన
తిరకాసులేనిదే ఏ పని చెయ్యనలేవు తారు మారు తప్పులతోనే
దేవుడి డయ్యావు ఉప్పులేని ఉత్పత్తి వంట ఒక్కపూట తినలేవు
నువ్వు సంధ్రమున్నదందుకేనని తీరుగా మర్చిపోయావు లేని
పోని ప్రశ్నలు వేసే చిట్టి బుర్ర నీకు ఇచ్చింది నేను దాన్ని నువ్వు
సాన పెట్టకుంటే అర్ధం కాను నేను ఏది ఎక్కడుందో అక్కడుంటే
నీళ్ళు ఎందుచేత ఉందో తెలుసుకుంటే చాలు చిత్రం బోద పడదా
చిక్కులే తీరిపోవా గడ్డిపోచ నుంచి గగనాల ద్వీపాలు అన్నీ చోట్ట ఉండి
నాదే ఆనవాలు లోకం రంగుల పరదా చిత్రమే నాకు సరదా ||2||

No comments: