02 July 2010

సిలకేమో సీకాకుళం......

సిలకేమో సీకాకుళం......అర్రె కులుకేమో మల్కిపురం
సిలకేమో సీకాకుళం కులుకేమో మల్కిపురం
సొగసేమో యిసాపట్నం జగదాంబ జంక్షనురో
పెదవేమో పిఠాపురం రుచిచూస్తే మిఠాయ్‌పురం
నడుమేమో గరం గరం భీమిలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో
మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుకి జర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
మాస్‌తో పెట్టుకుంటె మడతడిపోద్ది
ఒంట్లో ఒక్కో నరం మెలిపడిపోద్ది ||సిలకేమో||

అరె యే యే యే.....
వన్నెచూస్తె పాలగడి ఒళ్ళుచూస్తె పూలగడి
బుగ్గచూస్తె భోగాపురం బూరెల కావడి
దీని జబ్బచూస్తె పర్లాకిమిడి కొబ్బరి చలిమిడి
అరె యే యే యే.....
పూసపాటి పుంజుకోడి రోషమొస్తె అబ్బాడి
ముందుయెనక నోట్లో ఉన్న ముప్పై పళ్ళూడి
అబ్బో అప్పోసిసనైపోతాదే అప్పుడె పిండి పిండి
ఓసి నా రాజమండ్రి పలకదోర జాంపళ్ళ బండి
పూల పండక్కి వచ్చి పాల వెండి చుక్కల్లొ పక్కేసి లాగిస్త నా బండి
మాస్‌తో పెట్టుకుంటె మడతడిపోద్ది అద్ది
ఒంట్లో ఒక్కో నరం మెలిపడి పోద్ది ||సిలకేమో||

అరె యే యే యే.....
ఉన్నోళ్ళు లేనోళ్ళని మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటేమానవు టక్కరి తోడేళ్ళు
వాటి ఆటలింక కట్టించకుంటే బతకరు పేదోళ్ళు
అరె యే యే యే.....
ముందుమరి ఈ సంగతి తెలుసుకోండి పెద్దోళ్ళు
లోటుఇంక సరిజేయకుంటే నాబోటి కుర్రోళ్ళు గోయిందా
వీధికెక్కి పెట్టక మానరు వీపుల దంపుళ్ళు
నువ్వు సేనాని వయ్యో సింహాచలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యో ఎదుటివాడి మేలును కోరే మనిషివి నువ్వేరో
మాస్‌తో పెట్టుకుంటె మడతడిపోద్ది అద్ది
ఒంట్లో ఒక్కో నరం మెలిపడి పోద్ది ||సిలకేమో||

No comments: