14 July 2010

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మ

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మ ||2||
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని ||2||
కొలువై ఉందువుగాని కలుములరాణి ||రావమ్మా||

చరణం 1

గురివిందా పొదకిందా గోరువంకా పలికే
గోరింటా కొమ్మల్లో కోయిల్లు పలికే ||2||
తెల్లారి పోయింది పల్లె లేచింది ||2||
పల్లియలో ప్రతి ఇల్లూ కళ్లూ తెరిచింది ||రావమ్మా||

చరణం 2

కడివెడు నీళ్లూ కల్లాపిచల్లి గొబ్బిళ్లో గొబ్బిళ్లు
కడివెడు పసుపూ గడపకు పూసి
గొబ్బిళ్లో గొబ్బిళ్లు ||2||
ముత్యాల ముగ్గుల్లో! ముగ్గుల్లో గొబ్బిళ్లు
రతనాల ముగ్గుల్లో! ముగ్గుల్లో గొబ్బిళ్లు ||రావమ్మా||
కృష్ణార్పణం

చరణం 3

పాడిచ్చే గోవులకు పసుపూ కుంకం
పనిచేసే బసవనికి ప్రతీపుష్పం ||2||
గాదుల్లో ధాన్యం కావిళ్ళా భాగ్యం ||2||
కష్టించే కాపులకూ కలకాలం సౌఖ్యం
కలకాలం సౌఖ్యం ||రావమ్మా||

No comments: