17 July 2010

రాశాను ప్రేమలేఖలెన్నో

||పల్లవి||
రాశాను ప్రేమలేఖలెన్నో.....దాచాను ఆశలన్నీ నీలో....
భువిలోనా మల్లికలాయే...దివిలోనా తారకలాయే నీ నవ్వులే...||రాశాను||
||చరణం 1||
కొమ్మల్లో కోయిలమ్మ ఒయన్నదీ...||2 times||
నా మనసు నిన్నే తలచి ఒయన్నదీ.....
మురిపించే ముద్దులు రాలి మొగ్గేసింది...చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది.... ||రాశాను||
||చరణం 2||
నీ అడుగుల సవ్వడి ఉంది నా గుండెలో .....నీ చల్లని రూపం ఉంది నా కనులలో....
నాలోని సోయగమంతా విరబూసెలె.....మన కోసం స్వర్గాలన్ని దిగివచ్చేనులే... ||రాశాను||
||చరణం 3||
అందాల పయ్యెద నేనై ఆటాడనా....కురులందు కుసుమం నేనై చెలరేగనా....
నీ చేతుల వీణను నేనై పాట పాడనా....నీ పెదవుల గుసగుస నేనై పొంగి పోదునా....||రాశాను||

No comments: