02 July 2010

ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్‌రే

||పల్లవి||
ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్‌రే
బాపుబొమ్మ కదులుతోంది బాపురే
ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్‌రే
ఊపు చూపి ఆపుతోంది ఊపిరే
హార్ట్ ఫిల్ములో తనకు చోటు ఇవ్వగా....
నా హార్ట్ ఫిల్ములో తనకు చోటు ఇవ్వగా....
నేనవుతా కొత్త సత్యజిత్‌రే ||ఛాంగ్ ఛాంగ్||

||చరణం 1||
ఎంకి పిల్ల ఒంపు.... యక్ష కన్నె మెరుపు
ఎలిజబెత్ నునుపు.....ఎదురులేని రూపు
తేనె పాత్రవే...... లేత క్లియోపాత్రవే......
తెల్లవారనీ రాత్రివే....
గ్రీకు ఇంతివే... గిటారు తంత్రివే.....
సోకు శాఖకు మంత్రివే.....
ఇండియాలో నీకు సాటి ఉండరే.... ||ఛాంగ్ ఛాంగ్||

||చరణం 2||
మాయ లేడి హొయలు....... మైక్రోసాఫ్ట్ కళలు
గూటి పడవ వగలు..... ఎయిర్‌క్రాఫ్ట్ లయలు
ఓ శకుంతలా...... బంతిపూల సంతలా.....
కొంగు చుట్టిన కోయిలా...
దేవ కాంతలా..... దమయంతి రీతిలా.....
కోక కట్టిన వెన్నెలా.......
నిగ నిగల నిధికి నువ్వు ఓనరే......

ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్‌రే
హంపి శిల్పకళలు నాలో హాజరే
ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్ ఛాంగ్‌రే
పాలసరసు లాంటి సొగసు కాంచరే
కాట్ వాకులు.... ఫాషన్ పరేడ్‌లు
యాడ్ సంస్థలు..... అందాల క్లబ్బులు
నా స్టైల్సు నే చేస్తాయి స్పాన్సరే.....

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips