10 July 2010

బూరెలాంటి బుగ్గ చూడూ

బూరెలాంటి బుగ్గ చూడూ
కారు మబ్బులాంటి కురులు చూడు..
వారెవా ! క్యా హైర్ స్టైల్ యార్
అన్నా.. సుపెర్ అన్న చొంతినుఎ..చొంతినుఎ

హే..ఓ..వాలు కళ్ళ వయ్యారీ..తేనెకళ్ళ సింగారీ
నా గుండెలోకి దూరి..మనసులోకి జారి చంపినావె కావేరీ

హో..బూరెబుగ్గ బంగారీ..చేపకళ్ళ చిన్నారీ
బుంగమూతి ప్యారీ..నంగనాచి నారీ..లవ్వు చెయ్యి ఓ సారి
హ..నిన్ను చూసినాక ఏమయ్యిందొ పోరి
వింత వింతగుంటోంది ఏమిటో ఈ స్టోరి
నువ్వు కనపడకుంటే తోచదే కుమారీ
నువ్వు వస్తే మనసంతా..స..రి..గ..మ..ప..ద..ని..

హో..వాలు కళ్ళ వయ్యారీ తేనెకళ్ళ సింగారీ
నా గుండెలోకి దూరి..మనసులోకి జారి
చంపినావె కావేరి..నన్ను ముంచినావె దేవేరీ

నీ హౄదయం లో నాకింత చోటిస్తే
దేవతల్లే చూసుకుంటా..నీకు ప్రాణమైనా రాసి ఇస్తా
అలా కోపం గా నా వైపు నువ్వు చూస్తే
దీవెనల్లే మార్చుకుంటా..దాన్ని ప్రేమలాగ స్వీకరిస్తా
నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే
ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే
వప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే..నీకు నేను ఇష్టమేనని

హో..వాలు కళ్ళ వయ్యారీ.. వాలు కళ్ళ వయ్యారీ
తేనెకళ్ళ సింగారీ.. తేనెకళ్ళ సింగారీ..
నా గుండెలోకి దూరి..మనసులోకి జారి
చంపినావె కావేరి..నన్ను ముంచినావె దేవేరీ

వహొ ఆ హొ వహూ ఆ హొ కుర్రాడు మంచివాడుగా వొప్పుకో
వహూ ఆ హొ వహూ ఆ హొ ఆరడుగులందగాడు వొప్పుకో

ఈ ముద్దుగుమ్మే నా వైఫ్ గా వస్తే..
బంతిపూల దారి వేస్తా..లేతపాదమింక కందకుండా
ఈ జాబిలమ్మే నా లైఫ్ లో కొస్తే..
దిష్టి తీసి హారతిస్తా..ఏ పాడుకళ్ళు చూడకుండా
నాలాంటి మంచివాడినీ..మీరంతా చూసి ఉండరే
ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే
వప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే..నువ్వు నాకు సొంతమేనని

హో..వాలు కళ్ళ వయ్యారీ.. వాలు కళ్ళ వయ్యారీ
తేనెకళ్ళ సింగారీ.. తేనెకళ్ళ సింగారీ..
నా గుండెలోకి దూరి..మనసులోకి జారి
చంపినావె కావేరి..నన్ను ముంచినావె దేవేరీ

No comments: