17 July 2010

దింతనననా దింతన దింతన . . .

పల్లవి

దింతనననా దింతన దింతన . . .
గంగా.. నీ ఉరుకులె రాగంగా నా గుండెలొ మోగంగా
సరిగమలే సాగంగా మధురిమలో మునగంగా
గంగా.. నిజంగా.. నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులే రాగంగా నా గుండెలే మోగంగా
సరిగమలే సాగంగా నాలో సగభాగంగా ||2||

చరణం 1

నువ్విచ్చిన మనసే క్షేమం నువ్వు పంచిన ప్రేమే క్షేమం నువ్వై నేనున్నాను క్షేమంగా
మనమాడిన ఆటలు సౌఖ్యం మనసాడిన మాటలు సౌఖ్యం
మనువయ్యే కలలున్నాయి సౌఖ్యంగా
నే చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా
ప్రతి పదమున నువు ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా ||నీ ఉరుకులే||

చరణం 2

నువ్వు పంపిన జాబుల పూలు నా సిగలో జాజులు
కాగా దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా
చేరాతలు నా తల రాతను మార్చంగా
నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనస్సుకు అద్దంగా
నువ్వు చేసిన నీ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగ భాగంగా
నీ ఉరుకులే

3 comments:

Bharath said...

కీర్తికగారు, మొదటిసారి మీ బ్లాగ్ చూస్తున్నాను. తెలుగు పాటలను ఒకచోట చేరుస్తున్నందుకు చాలా సంతోషం . అన్యదా భావించకపోతే గంగోత్రి పాటలొ కొన్ని తప్పులున్నాయి. సర్దిదిద్దుతారని భావిస్తున్నా.

చరణం 1 లో: ప్రతి వనమున నువ్వు ప్రత్యక్షం గత జన్మలో నువ్వు వెలయని సౌభాగ్యంగా ...... అని రాశారు .
ప్రతి పదమున నువు ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా

ఇంకా కొన్ని తప్పులున్నాయి. కాని మొదటిసారి వచ్చి అన్ని తప్పులు వెతకడం బాగోదు కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నా. :-)

keerthika karlapudi said...

thanq so much mistake cheppinandhuku
inka ekkada thappulu rasamo koncham chepandi so tat correct chestham

Bharath said...

Hi kirthika gaaru.. as promised.. here is the pallavi
పల్లవి:
గంగా.. నీ ఉరుకులె రాగంగా నా గుండెలొ మోగంగా
సరిగమలే సాగంగా మధురిమలో మునగంగా
గంగా.. నిజంగా.. నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులే రాగంగా నా గుండెలే మోగంగా
సరిగమలే సాగంగా నాలో సగభాగంగా

If u don't mind I wud like to take the liberty of correcting the mistakes if I find some. Thanks and once again.. good work.