14 July 2010

బావా చందమామా మరదల్లు వీరే ఇంటికి మణిదీపాలు

పల్లవి

బావా చందమామా మరదల్లు వీరే ఇంటికి మణిదీపాలు
గుణంలో మేలిమి బంగారం పనుల్లో ఎవ్వరు సరిపోరు
మావాళ్ళ ముందర నీవాళ్ళు నిజంగా తేలిపోతారు
భామా సూర్యచంద్రులు మా వాళ్ళు నాకు వీరే భరతలక్ష్మణులు
నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు
నా గుండె చప్పట్లే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు

చరణం 1

ఎప్పుడూ అప్పుడూ ప్రేమలో మునగడం తప్పదమ్మా
ఎవ్వరు అతడు ఎక్కడా ఉండటం చెప్పవయ్యా వాడి గాధ
రాజాలా ఉంటాడే ప్రేమంటే వాడేలే
నచ్చితే అమ్మడు చెప్పవే ఎప్పుడూ పట్టిబట్టి జట్టు చేస్తా
చక్కని ఒదినకీ సౌ అనే అన్నకీ వీడిపోని బంధమేస్తాం
ఊ అంటే కన్యారత్నాలే కానిస్తా కన్యాదానాలే
వయ్యారి అక్కా చెళ్ళిల్లేఔతారు తోడికోడళ్లే

చరణం 2

సంగీతం
మా సొంతం
కొంగులో కొట్టడం పైటనే జార్చడం నచ్చినట్టు గుర్తులేలే
గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం తియ్యనైన ప్రేమతీరే
ఆ ప్రేమే శ్రీకారం
నీకే నా సహకారం
అక్కలే ఆకులై బావలే వక్కలై పక్కపక్క చేరుకొటే
ఉమ్మడి కాపురం ఉత్తరం అందరూ ఒక్కటిగా సాగిపోండీ
భలేగు చెప్పేవ్ బాబయ్యా మాటంటి పెళ్ళిళ్ళ పేరయ్య
హనీమూన్‌ వెళ్ళండోరయ్యా చెయ్యండీ నన్ను తాతయ్య ||భామా||

No comments: