14 July 2010

వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా కో

పల్లవి

వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా కో ||సామిరంగా||
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కో ||సామిరంగా||
ప్రేమరాగం తమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే ||వాన వల్లప్పా||

చరణం 1

ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో
మేఘాల సీజన్లో కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే
జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్
తారా రారా రారా ||2|| ||వాన వల్లప్పా||

చరణం 2

వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో
పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో
అమ్మదొంగ సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా
అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా
తూరు రురు తూరు రురు తూరు రురు ||వాన వల్లప్పా||

No comments: