13 July 2010

నీకోసం ప్రతీక్షణం నిలువెళ్ళా నిరీక్షణం

ఓ ఒ ఒ ఓ ఓ ఒ ఒ ఓ ఒ ఒ ఒ ఒ ఒ ఓ ఓ ఓ ఒ ఒ ఒ ఒ ఒ ఓ ఓ ఓ
నీకోసం ప్రతీక్షణం నిలువెళ్ళా నిరీక్షణం
రగులుతున్న హృదయంలో ఓ ఓ ఓ
ప్రణయం నీకే అంకింతం
నిను చూడని నా కనుపాపలలో కొలువుండదు ఏ ఉదయం
నీకోసం ప్రతీక్షణం నిలువెళ్ళా నిరీక్షణం

ఎదను మీటిన కమ్మని రాగం కలగ మారినదా
ఎదుట వుందని నమ్మిన స్వర్గం కరిగిపోయినదా
ముడులు వేసిన మరుని దీవెన ముగిసిపోదుకదా
శత జన్మలకు జత వీడని నీ స్మృతి నీడనే నా పయనం

నీకోసం ప్రతీక్షణం నిలువెళ్ళా నిరీక్షణం
రగులుతున్న హృదయంలో లో ఓ ఓ ఓ
ప్రణయం నీకే అంకింతం
నిను చూడని నా కనుపాపలలో కొలువుండదు ఏ ఉదయం

రుణము తీరిన తీయని స్నేహము మరపు రాదుకదా
అలల మాదిరి తీరని దాహము అలసిపోదుకదా
చినుకు చేరని నడి ఎడారిని నడక ఎంత వృదా
తడి ఆరని నీ ఎద కోనలలో చిగురించదా వలపు వనం

నీకోసం ప్రతీక్షణం నిలువెళ్ళా నిరీక్షణం
రగులుతున్న హృదయంలో ఓ ఓ ఓ
ప్రణయం నీకే అంకింతం
నిను చూడని నా కనుపాపలలో కొలువుండదు ఏ ఉదయం

ఓ ఒ ఒ ఓ ఓ ఒ ఒ ఓ ఒ ఒ ఒ ఒ ఒ ఓ ఓ ఓ ఒ ఒ ఒ ఒ ఒ ఓ ఓ ఓ

No comments: