కొమ్మల్లో కోయిలా కూసింది తీయగా
గుండెల్లో ఊయలా ఊగిందే హయిగా
ఆ మొదటి ప్రేమ మహిమా ఈ మనసు ఆప తరమా తీరని భారమా ఆ..
వలపు వాలు చినుకే నా మది మీటనా
మనసు వీణ పలికే ఆశల కీర్తనా
వరములేవో అడిగే నీ జత చేరనా
మరుల గోల ముదిరి తీరని యాతనా
హే అరే మనకసలు
మొదటే ఇదివరకు
చిలిపి కలవరము లెదు గా
పడుచు మనసులను
సరస సరిగమలు
కళల అలజడులు రేపేనా
నీతోనే చెప్పుకోని నీతోనే పంచుకొని
నాలోని ప్రేమని
దుడుకు ప్రాయమే అసలే ఆగదు మానవా
చిలిపి సాయం అడిగే నీవిక మారవా ఆ
తలపులేవో మెదిలే నా మది చాటునా
తపనలేవో ఎగసే ఊపిరిమాటునా
చిగురు పెదవులిక
వణికె తడబడినా
అసలు కణికారము లెదుగా
అలక వలదు ఇంకా
అధర సుర తగిలి
మధుర పరవశము లేకదా
మబ్బుల్లో తేలిపొని గుండెల్లో వాలిపోని జోకొట్టెయి ఆశని
No comments:
Post a Comment