07 June 2010

మధురయాతన ముదిరిపోయిన

మధురయాతన ముదిరిపోయిన
చినుకు రాగానా....చిలిపి తాళాన
నీటి ఊయలలో ఊగనీ ప్రాయం
వేడి ఊహలతో పాడనీ గేయం
పెదవి కలగలిపే తరుణాన

శ్రుతులు మించిన జతులు పెంచిన
వయసులో ఉన్నా వరదలవుతున్నా
ఘాటు కౌగిలితో ఆదుకో అందం
చాటు తేనెలతో తిరనీ దాహం
చినుకు సెగ రగిలే తడిలోన

తధీం తానన కదం సాగిన
పడుచు తిల్లానా పలికేనీ వాన
నీటి గాలిలతో చెమటలారేనా
తీపి తేమలతో తపన తీరేనా
మెరుపు కనుగీటే పరువాన

No comments: