07 June 2010

మనిషికో స్నెహం మనసుకొ దాహం

మనిషికో స్నెహం మనసుకొ దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు

ఒక చిలక పొద్దికైంది మరు చిలక మచ్చికైంది
వయస్సేమో మరిచింది మనస్సు ఒకటై కలిసింది
కట్ట కట్టి ఆపలన్న గంగ పొంగులాగేనా
ప్రేమ లేని నాడే ఇలా పువ్వులన్ని పుచ్చేనా
మనిషిలేని నాడు దేవుదైన లేడు
మంచిని కాసే వాడు దేవుడికి తోడు


వయస్సు వయస్సు కలుసుకుంటే పూరి గుడిసే రాజనగరు
ఇచ్చుకోను పుచ్చుకోను ముద్దులుంటే పొద్దు చాలదు
ప్రేమ నీకు కవలంటే పిరికి వాడు కారాదు
గువ్వ గుడూ కట్టె చోట కుంపటత్తి పోరాదు
ఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తం
జాతి మత భేధాలన్ని స్వార్ధ పరుల మోసం

No comments: