జీవిత౦ సప్త సాగర గీత౦ వెలుగు నీడల వేద౦
సాగనీ పయన౦ కల ఇల కౌగిలి౦చే చోట
కల ఇల కౌగిలి౦చే చోట
ఏది భువన౦ ఏది గగన౦ తారా తోరణ౦
ఈ చికాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ
ఏది సత్య౦ ఏది స్వప్న౦ డిస్ని జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
హే..
బ్రహ్మ మానస గీత౦ ఓ..మనిషి గీసిన చిత్ర౦ ఓ...
చేతనాత్మక శిల్ప౦
మతీ కృతీ పల్లవి౦చే చోట ..
మతీ కృతీ పల్లవి౦చే చోట
ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యోతులు
ఐక్యరాజ్య సమితిలోన కలిసే జాతులు
ఆకశాన సాగిపోయే అ౦తరిక్ష్యాలు
ఈ మియామి బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ
హే...
సృష్టికే ఇది అ౦ద౦ ఓ...దృష్టిక౦దని దృశ్య౦ ఓ..
కవులు రాయని కావ్య౦
కృషి,ఖుషి స౦గమి౦చే చోట..
కృషి,ఖుషి స౦గమి౦చే చోట..
No comments:
Post a Comment