03 June 2010

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిల పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే ఒయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై..


ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళల్లోన ఎల్లకిలా పడ్డట్టున్న అల్లోమల్లో అకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మా అబ్బాయంటే సూరిడమ్మ
ఇంటి దీపాలవ్వలంటా దిక్కుల్లో
ఎవరికి వారే...యమునకు మీరే...
రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే..

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన బాలసొగసుల బాటల్లో
బుగ్గందాల ఇల్లునవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే బాలయ్యొచ్చి కోలాటడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో
పరవశమేదో ....పరిమళమాయే...
పువ్వు నవ్వే దివ్వే నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే ..

No comments: