03 June 2010

కన్నె కొమ్మన తుమ్మెదా రావమ్మా జత కట్టమ్మా

కన్నె కొమ్మన తుమ్మెదా రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా
కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగా
ఈడేరగ తారాడగ అబ్బురాల
నాజూకుగ నాదానిగ అమ్మలాలా
గుండెలోన తొలకరింపు పొంగే జల్లుల్లో
కొండకోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో

మిల మిల కళ్ళల్లో అల పూసే పున్నాగ తేరు ..హోయ్
చెలి చిరు హృదయంలో ఎల సవ్వడి ముచ్చట తీరు
కోరికలతోనా సంబరమాయే చేరుకోవే మైనా
గోరింక వలచి వచ్చి మారాలా ఊసుల్ని ఉసిగొలిపి జాగేలా
బాలా పరువాల సిగ్గు మురిపాలా ముద్దాడగ మేలాయెద
ఈడేరిన వేళ

కన్నె కొమ్మన తుమ్మెదా రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా


గల గల గోదారి తడి సరాగాల హోరు..
అరమరికలు లేక ఎద విహారాల జోరు...హోయ్
పూచినదీ ప్రాయం తుమ్మెద వాలా మనసు కొరే సాయం..
పూదొట మాటు చూసి పోదామా సరసాల జాగారం చేద్దామా
ఈడే విడ్డూరం..ఎందుకు మోమాటం
ఎన్నెల్లో జత కూడగ ప్రాయం దరహాసం

కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగా
ఈడేరగ తారాడగ అబ్బురాల
నాజూకుగ నాదానిగ అమ్మలాలా
గుండెలోన తొలకరింపు పొంగే జల్లుల్లో
కొండకోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో
కన్నె కొమ్మన తుమ్మెదా రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా

No comments: