ఎన్నో రాత్రులోస్తాయిగానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నొ ముద్దులిస్తారుగానీ లేదీ వేడి చెమ్మా
అన్నాడే...చిన్నోడూ అన్నిట్లో ఉన్నోడూ
ఎన్ని మోహాలూ మోసీ ఎదల దాహాలు దాచా
పెదవి కురికే పెదవి కొరకే ఓహొ..హొ..
నే ఎన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే ఓహొ..హొ..
మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే తడివినా
ప్రాయం సొగసునే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఓ....
గట్టి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే ఓహొహొ..
నీ గోటి గిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే ఓహొహొ..
అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమీ బడలిక
ఛీ పో బిడియమా శెలవికా
నాకీ పరువమే బరువికా
ఓ....
No comments:
Post a Comment