07 June 2010

మల్లెపూల మారాణికీ బంతిపూల పారాణీ

మల్లెపూల మారాణికీ బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా కన్నెజాజి ముంగిళ్ళలోనా
కోకిలమ్మ పాట కచేరీ

పొగడపూలైనా పొగడే అందాలే మురిసే మలిసంధ్యవేళలో
మల్లెమందారం పిల్లకి సింగారం చేసే మధుమాసవేళలో
నా రాగమే .. నీ ఆరాధనై
చిరంజీవిగా.. దీవించనా happy birthday to u

రెల్లు చేలల్లో రేయి వేళల్లో కురిసే వెన్నెల్లనవ్వుతో
పుట్టే సూరీడూ బొట్టై ఏనాడూ మురిసే ముత్తైదుశోభతో
నీ సొభగ్యమే.. నా సంగీతమై
ఈ జన్మకీ... జీవించనా happy birthday to u

No comments: