తొలిసారి ముద్దివ్వమందీ చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ చిరుచాటు ఈ తేనెటీగా
ఆ.. ఆ..
నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం
నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే
నీ ఊపిరి సోకి మనసు వేణువులూదే
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం
సిరిమల్లెపూలు గుప్పు మంది నీకోసం
నీ నవ్వులలోనే వలపు గువ్వలు సాగే
నీ నడకలలోనే వయసు మువ్వలు మ్రోగే
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా
ఇక రేపు మాపు తీపి వలపు పంటలుగా
నులి వెచ్చన కాదా మనసిచ్చిన రేయీ
తొలిమచ్చికలోనే సగమిచ్చిన హాయీ
No comments:
Post a Comment