సొగసు చూడ తరమా..హా హా సొగసు చూడ తరమా..
సొగసు చూడ తరమా..హ హ హ నీ సొగసు చూడ తరమా..
సొగసు చూడ తరమా..నీ సొగసు చూడ తరమా..
నీ ఆప సోపాలు.. నీ తీపి శాపాలు..
ఎర్రన్ని కోపాలు.. ఎన్నెల్లో దీపాలు.. అందమే సుమా..
సొగసు చూడ తరమా..నీ సొగసు చూడ తరమా..
అరుగు మీద నిలబడీ నీ కురులను దువ్వే వేళా..
చేజారిన దువ్వెన్నకు బేజారు గ వంగినపుడు..
చిరుకోపం చీరకట్టి సిగ్గుని చెంగున దాచీ..
ఫక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు...
ఆ..సొగసు చూడ తరమా..నీ సొగసు చూడ తరమా..
పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించి కొట్టి
గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ
చెంగు బట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే..
తడిబారిన కన్నులతో గిడు గిడు మంటున్నప్పుడు..
విడు విడు మంటున్నప్పుడు...
ఆ...సొగసు చూడ తరమా..నీ సొగసు చూడ తరమా..
పసిపాప కు పాలిస్తూ..పరవశించి ఉన్నపుడూ...
పెదపాపడు పాకి వచ్చి మరి నాకో అన్నపుడూ..
మొట్టి కాయ వేసీ..చీ పోండి అన్నప్పుడు
హా హు హు నా ఏడుపూ..హహహ నీ నవ్వులూ
హరివిల్లయి వెలసినపుడు..
ఆ సొగసు చూడ తరమా..నీ సొగసు చూడ తరమా..
సిరిమల్లెలు హరి నీలపు జడలో తురిమీ..
క్షణమే యుగమై వేచీ వేచీ..
చలి పోగులు తెలికోకల ముడిలో అదిమీ..
అలసి సొలసి కన్నులు వాచీ
నిట్టూర్పులా నిశిరాత్రిలో.. నిదరోఉ అందాలతో..
త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటీ..
సొగసు చూడ తరమా..నీ సొగసు చూడ తరమా..
No comments:
Post a Comment