07 June 2010

వస్తావు కలలోకీ... రానంటావు కౌగిలికీ

వస్తావు కలలోకీ... రానంటావు కౌగిలికీ...||2||
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ..
ఆ ముద్దు మురిపాలూ.. తీరేది ఎన్నటికీ..

వస్తాను కలలోకి రానంటాను కౌగిలికీ..||2||
నువ్ కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ సగపాలు ఇద్దరికీ..

పెదవి పైనా పెదవికి గుబులూ..పడుచు దనమే తీయటి దిగులూ..
కుర్ర వాడికి తీరదు మోజూ.. చిన్న దానికి బిడియం పోదూ..
చూపూ చూపూ కలిసిన చాలూ.. కొంగూ కొంగూ కలిపిన మేలూ
నన్ను దరిచేరనీ.. ముందు వాటారానీ
ముద్దు నెరవేరనీ.. ముందు జతగూడనీ..

వస్తావు కలలోకీ...రానంటాను కౌగిలికీ..
నే కన్న కలలన్నీ..చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ సగపాలు ఇద్దరికీ..

చిన్న దాన్నీ నిన్నటి వరకూ..కన్నెనైనది ఎవ్వరికొరకూ..
నాకు తెలుసూ నాకోసమనీ.. నీకె తెలియదు ఇది విరహమని
నేనూ నువ్వూ మనమై పోయే వేళా..ఇంకా ఇంకా ఇంతటి దూరం ఏలా
వలచి వలపించనా..కరిగి కరిగించనా
నవ్వి నవ్వించనా.. గెలిచి గెలిపించనా..

వస్తాను కలలోకి రానంటాను కౌగిలికీ..
నువ్ కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ సగపాలు ఇద్దరికీ..

హేహా హా హ హ వస్తావు కలలోకీ...
లా ల్లల్లల్లాల.. రానంటావు కౌగిలికీ...||2||
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ..లా లాలలాలాలా
ఆ ముద్దు మురిపాలూ.. లా లాలలాలాలా.. తీరేది ఎన్నటికీ..

No comments: