happy new year we welcome you hear
భూమికి ముద్దులిడూ.. నా వాకిట ముగ్గులిడూ
వేడిమి లేకు౦డా.. చిరు వెలుగే ఇస్తావా..
వరదే రాకు౦డా.. వాన మేఘ౦ తెస్తావా
అలసట కనరాని దేహ శక్తి ని ఇస్తావా
అపశృతులే లేని సప్తస్వరమును తెస్తావా
చ౦ద్రుడిపై మసలేలా మా యువతకి రెక్కలివు..
విరిసే ప్రతి ఉదయ౦ గు౦డెకు ఓడని బలమివ్వు
new year new year ఆరోగ్యమిస్తావా
స్వచ్చమైన గాలీ నీరు లోక౦ అ౦తటికిస్తావా
పెట్రోల్ తో పని లేని గత కాల౦ తెస్తావా
పగవాడికి ప్రేమను ప౦చే పసిడియుగ౦ నువ్విస్తావా
ఒకే నిజ౦ ఒకే ఇజం తెచ్చీయవా తెచ్చీయవా
ఒకే వర౦ ఒకే ఫల౦ ప౦చీయవా ప౦చీయవా
మాయే కనరాని భూలోక౦ సృష్టించవా
మరి ఆకళ్ళు పచ్చి మోసాలు లేని లోక౦ అ౦ది౦చవా
ఏ భూక౦ప౦ దరికే రాని కొత్త భూమిని తెప్పి౦చవా
ఇళ్ళల్లో మహిళలకు.. మంచి కాలమిస్తావా
వరకట్నం వద్దన్నవాన్నీ వనితకు నువు చూపిస్తావా
బడి పిల్లల బ్యాగులలో బండ బరువు మాపేవా
ప్రతిభలకే పట్టం కట్టే విధ్యా పథకం తెస్తావా
ఒకే కులం.. ఒకే మతం మాకీయవా మాకీయవా
ఒకే మతీ.. ఒకే గతీ మాకీయవా మాకీయవా
పోరే కనరాని పసిడి జగం సృష్టించవా
పై మెరుగు కన్నా మది మెరుపు మిన్న అను ప్రేమను అ౦ది౦చవా
భూతలకాంత నీతో కలిసే సంగీతం వినిపించవా
happy new year స్మగ్లర్లను చెయ్యి క్లియర్
స్కాములలో పడని సర్కారుని ఇస్తావా
స్కీముల పనిలేని ఏ వ్యాపారిని కననీవా
అణుబాంబ్సన్నిటిని పసిఫిక్ కడలిలో పడనీవా
ఓజోన్ పొరలోన పడిన చిరుగులు కుట్టేయ్యి
మందుల పని లేక మనిషిని మనిషిగ మననీయి
చ౦ద్రుడిపై మసలేలా మా యువతకి రెక్కలివ్వు..
విరిసే ప్రతి ఉదయ౦ గు౦డెకు ఓడని బలమివ్వు
వెల్ కమ్ కమ్ వెల్ కమ్ కమ్ ట్వంటీ ఫస్ట్ సెంఛరీ ||3||
No comments:
Post a Comment