03 June 2010

చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా

వానా వానా వానా వానా

చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా
వానా వానా వానా వానా
చలి చలి స్వరముల వీణా ఎదలోన చిలిపి థిల్లానా
వానా వానా వానా వానా
ఏవేవో కొత్త ఊహలు
ఎన్నెన్నో కొంటె ఊసులు
ఆహ్వానం పాడుతున్న లయలోనా
చిలిపిగ చేరనా

నీటి మంటతో లేత ఒంటిలో తీగ ఈడు వేగుతున్న వింత చూడనా
కోడె జంటలో వేడి వంటతో సోయగాల పాయసాల విందు చేయనా
ఊరించే అందమందన ఊపిరితో ఊదుకొందునా
కళ్ళారా ఆరగించమంటే..
పరుగున వాలనా

చిమ్మచీకటీ సమ్మతించెలే కమ్మనైన సంగతేదో విన్నవించనా
తిమ్మిరేవిటో కమ్ముకుందిలే నమ్మరాని సంబరాన నిన్ను తేల్చనా
జల్లేమో వంతెనేయగా పిల్లేమో సొంతమాయెగా
లవ్లీగా చెంత చేరుకొని రా ...
తహ తహ పంచనా

వానా వానా వానా వానా

No comments: