నువు లేక అనాధలం
బ్రతుకంతా అయోమయం
నువు లేక అనాధలం
బ్రతుకంతా అయోమయం
బాబా ... ఓ బాబా ...
ఇక నీ పరీక్షకు మేమోపలేము
ఈటులీ నిరీక్షణం మెమోర్వలెము
(నువు లేక అనాధలం)
మా పాలి దైవమ్మని
మా దిక్కు నీవేనని
కొలిచాము దినం దినం సాయి...
మా ఆర్తి చూస్తావని
సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి...
శ్రీరాముడైన శ్రీకృష్ణుడైన
ఏ దైవమైన ఏ దర్మమైన
నీలొనే చూశాము సాయి..
రావా ...బాబా ... రావా ...
రక్ష ... దక్ష .. నీవే కదా మా బాబా ...
(నువు లేక అనాధలం)
మా ఏసు నీవేనని
మా ప్రభువు నీవేనని
ప్రార్ధనలు చెసామయా నిన్నే
అల్లాగ వచ్చావని
చల్లంగ చూస్తావని
చెశాము సలాం సలాం నీకే
గురునానకైన గురుగోవిందైన
గురుద్వారమైన నీద్వారకేనని
నీ భక్తులైనాము సాయి....
రావా ...బాబా ... రావా ...
రక్ష ... దక్ష .. నీవే కదా మా బాబా ...
నువు లేక అనాధలం
కృష్ణ సాయి కృష్ణ సాయి
రామ సాయి అల్లా సాయి
మౌలా సాయి నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డి సాయి ఓం ...
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి ఓం
No comments:
Post a Comment