03 June 2010

వెన్నెల రేయీ ఎంతొ చలీ చలీ

ఓ...ఓ....

వెన్నెల రేయీ ఎంతొ చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
చల్లని జాబిలీ నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ


చూపులతోనే మురిపించేవు
చూపులతోనే మురిపించేవు
ఆటలతోనే మరిపించేవు
ఆటలతోనే మరిపించేవు
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా
పొరపాటైతే పలుకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే


నా మనసేమో పదమని సరేసరే

మర్యాదేమో తగదని పదే పదే
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
వాదాలెందుకులే అవునని కాదనిన ఏమనిన నాదానివిలే

No comments: