07 June 2010

అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగా వాలే ఎన్నో వర్ణాలు

అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగా వాలే ఎన్నో వర్ణాలు

ఇదిగిదిగో కలలను చూపుతూ ఎదలను ఏలే ఎవో వైనాలు

ఎగిరొచ్చే ఆ గువ్వలా చిగురించే ఈ నవ్వులా సాగే సావాసం

ప్రతి హ్రుదయంలో ఆ కల నిజమైతే ఆపేదెలా పొంగే ఆనందం

కలైనా ఇదో కధైనా రచించే ఏవో రాగాలే

ఈ సమయం ఎ తలపులలో తన గురుతుగ విడిచెళుతుందో

ఈ మనసుకు జత ఏదంటే తను ఏమని బదులిస్తుందో



వరమనుకో దొరికిన జీవితం ఋతువులు గీసే రంగుల ఓ చిత్రం

ఈ పయనం ఏ మలుపులో తన గమ్యాన్నే చేరునో చూపే దారేది

వరించే ప్రతీ క్షణాన్నీ జయించే స్నేహం తోడవనీ

తన గూటిని వెతికే కళ్ళు గమనించవు ఎద లోగిళ్ళు

తలవంచిన మలి సంధ్యల్లో శెలవడిగెను తొలి సందళ్ళు

No comments: