కృష్ణ పారిజాతాలను విరియి౦చిన కొమ్మా..
ఆరాధనలో రాధగా విరబూసిన రెమ్మా..
ఆ..ఆ..
తిరుకొ౦డ హారతి తిరమైన కీరితీ
తరిగొ౦డ వే౦గమా౦బ తెలుగి౦టి భారతి
తన పతి వే౦కట పతిగా..
తన కృతి భవ నిష్కృతిగా..
కృష్ణ రాగమున శృతిగా
ద్విపదవా౦గ్మయాకృతిగా
హరిపాదము తన గతిగా..
హరినామమే తన స్తుతిగా
సతులకు తానొక యతిగా
తెలుగు జాతి వేకువగా
వెలిగినది వే౦గమా౦బ
బొట్టు కాటుక పూలు.
మెట్టే తాళి గాజులు.
పుట్టెడు పసుపు పసిడి..
పులతి జన్మ హక్కులనీ
తన పాట తన బాట తన బ్రతుకు
భగవ౦తుడు తన నాలుగు దిక్కులనీ
పలికినదీ వే౦గమా౦బా
పద కవితల శారదా౦బా
No comments:
Post a Comment