అహ వయసంతా ముడుపు గట్టి.. వసంతాలే ఆడుకుందాం ||2||
మావల్నీ మాటేసి.. బావల్నీ వాటేసి.. మావల్నీ మాటేసి బావల్నీ వాటేసి
ఆడిద్దాం ఒక ఆటా...ఆడిద్దాం ఒక ఆటా...
యహ మావా మావా మల్లె తోటా... బావా బావా మంచి మాటా.. అహ బావా బావా మంచి మాటా..
||వయసంతా||
రారా నా రాజా చెట్టుకింద రాజా ||2||
నీ ముచ్చట్లు తీరుస్తామూ ముద్దు మురిపాల్లో ముంచేస్తాము...||2||
మావా మావా మల్లె తోటా... బావా బావా మంచి మాటా.. అహ బావా బావా మంచి మాటా..
నడిచొచ్చే నల్ల గొండా.. నీ కడుపు చల్లగుండా..||2||
ఎన్నో నెలే నీకు మామయ్యా...||2||
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం..
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం...ఆఆ..||2||
మావా మావా మల్లె తోటా... బావా బావా మంచి మాటా.. అహ బావా బావా మంచి మాటా..
||వయసంతా||
వచ్చాడమ్మా వసంతుడు నవ మన్మధుడూ...
మచ్చలేని చంద్రుడు మనుషుల్లో ఇంద్రుడూ..వచ్చాడమ్మా వసంతుడు..
ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు...||2||
వచ్చె వచ్చె వచ్చె కుంటి కులాసం..ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం
పైట కొంగు చాటుబెట్టి పడుచు అందం పసుపు రాసి వలపు తీరా నలుగు పెట్టి
ఆశలన్నీ ఆరతిస్తా రావయ్యో.. తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో..||2||
మావా మావా మల్లె తోటా... బావా బావా మంచి మాటా.. అహ బావా బావా మంచి మాటా..
||వయసంతా||
No comments:
Post a Comment